బెంగళూరు టెక్ సమ్మిట్ 2025లో ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ సానియా మీర్జా అప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ.. భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు రిచా ఘోష్‌కు సలహాలు ఇచ్చారు. సోషల్ మీడియాను అస్సలు పట్టించుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలని, పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదని చెప్పారు. మొదట్లో మహిళల క్రికెట్‌కు అంత ఆదరణ ఉండేది కాదని, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు కాదని.. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా…