Bengaluru Blast: బెంగళూర్ రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితులును శుక్రవారం ఎన్ఐఏ పశ్చిమబెంగాల్‌లో అరెస్ట్ చేసింది. వీరిని విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ గుర్తింపును కప్పిపుచ్చుకునేందుకు హిందూ పేర్లను వాడినట్లు తేలింది. నిందితులిద్దరు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాలు మారుపేర్లు ఉపయోగించుకుంటూ పలు ప్రాంతాల్లో ఆశ్రయం పొందారు. 42 రోజలు తర్వాత పట్టుబడిని వీరు గెస్ట్‌హౌజ్, ప్రైవేట్ లాడ్జిల్లోనే బస చేశారు. కర్ణాటక శివమొగ్గకు చెందిన…
Bengaluru cafe blast: బెంగళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక సూత్రధారిని నిన్న పశ్చిమబెంగాల్ నుంచి అరెస్ట్ చేశారు. అరెస్టైన్ అబ్దుల్ మతీన్ తాహాని ‘‘ అత్యంత విలువైన ఆస్తి’’గా ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
Bengaluru cafe blast: బెంగళూర్ రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ విచారన వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాన నిందితులకు సహకరించిన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేయగా.. ఇద్దరు నిందితులు ముసావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాలపై ఎన్ఐఏ భారీ రివార్డు ప్రకటించింది.
Bengaluru cafe blast: మార్చి 1న బెంగళూర్‌లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, అప్పటి నుంచి నిందితుడిని పట్టుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), బెంగళూర్ క్రైం ఇన్వెస్టిగేషన్ టీం ప్రయత్నిస్తున్నాయి. నిందితుడికి సంబంధించిన వీడియోలను విడుదల…
Bengaluru Cafe Blast: బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు నిందితుడి కొత్త ఫోటోలను కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విడుదల చేసింది. మార్చి 3న కేసును స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ, నిందితుడిని గుర్తించేందు ప్రజల సాయాన్ని కోరింది. మార్చి 1న బెంగళూర్‌లోని ఐటీ కారిడార్‌లోని కేఫ్‌లో నిందితుడు బ్యాగుల్లో ఐఈడీ బాంబును ఉంచి, టైమర్ సాయంతో పేల్చాడు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పేలుడు తర్వాత నిందితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది.
Bengaluru Cafe Blast : బెంగళూరు కేఫ్‌లో పేలుడు నిందితుడి ఫోటోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ ఫోటోల్లో నిందితుడు టోపీ పెట్టుకుని బస్సులో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది.