Sudipa Chatterjee: బంగ్లాదేశ్ కుకింగ్ షోలో పాల్గొన్న బెంగాలీ నటి సుదీపా ఛటర్జీ వివాదంలో ఇరుక్కుంది. షోలో యాంకరింగ్ చేస్తున్న సమయంలో ఒక పార్టిసిపెంట్ ‘‘బీఫ్’’ వంటకాన్ని తయారు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. బీఫ్ వంటకాన్ని తయారు చేసిన పార్టిసిపేటెంట్‌తో ఇంటరాక్ట్ కావడంతో కొందరికి నచ్చలేదు.