Bengal panchayat polls: గత నెల కాలంగా పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర హింస నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య తీవ్ర పోటీ మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. అయితే తాజాగా ఈ రోజు ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) హవా కొనసాగింది. ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
Bengal Panchayat Polls: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ముందు ముర్షిదాబాద్ జిల్లాలో ఒకే రోజు రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. ఒక సంఘటనలో ఐదుగురు చిన్నారులు బాంబును బంతిగా భావించి ఆడుకుంటుండగా పేలుడు సంభవించి గాయపడ్డారు.