పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో అనుమతి ఉన్నప్పటికీ రామనవమి ఊరేగింపుపై దుండగులు దాడి చేశారని ఆరోపించిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) పరిగణలోకి తీసుకుంది. ఈ అంశంపై విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హౌరా కమిషనర్ ఆఫ్ పోలీస్‌లకు హక్కు సంఘం నోటీసులు జారీ చేసింది.