EC Big Action: బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల్లో అధికారులపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న పోలింగ్ ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం చాలా పగడ్బందిగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగిలే ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. పలు రాష్ట్రాల్లో అధికారులపై యాక్షన్ మొదలు పెట్టింది.
6 రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జార్ఖండ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్‌లో హోంశాఖ కార్యదర్శులను తొలగించింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఎన్నికల కమిషన్ తొలగించింది.
Also Read
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల్లోనే ఎన్నికల కమిషన్ తీసుకున్న తొలి యాక్షన్ ఇదే. దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో పాటు అదనంగా మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శులను కూడా తొలగించింది. ఇక పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)పై చర్యలు తీసుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా తొలగించింది.
లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన రెండు రోజులకే ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. దాదాపు రెండు నెలల పాటు ఈ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న అన్ని స్థానాలకు కౌంటింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!