బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తాను అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పెన్లన్లు అందజేశారు..