దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా ఎగిసిన ఆ తరువాత సెన్సెక్స్ 641 పాయింట్ల లాభంతో 52239 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 15550 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. జాతీయం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ లాభాలు ఎంతవరకు కొనసాగుతాయనేది చూడాల్సి ఉంది. ఒక్క ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ మినహా అన్ని రంగాల షేర్లలోనే కొనుగోళ్లు…