రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. బెలారస్‌లో ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపుతున్నారు. ఇదిలా వుంటే ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపకపోతే 70 లక్షల మంది వలస వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని ఉక్రెయిన్ పట్టుబడుతుండగా.. పలు ఒప్పందాలకు ఆమోదం తెలపాలని రష్యా డిమాండ్ చేస్తోంది. తమ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులు సహా ఇతర దేశస్తులు సురక్షితంగా దేశాన్ని విడిచి వెళ్లేలా సాయం…
కోవిడ్ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్ లిస్ట్ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…