Bandla Ganesh: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ భక్తుడిగా బండ్లకు పవన్ ఫ్యాన్స్ లో మంచి పేరే ఉంది. నిత్యం సోషల్ మీడియా లో పవన్ గురించి ఏదో ఒక విషయాన్నీ పోస్ట్ చేయడం, పవన్ ను విమర్శించిన వారిని ఏకిపారేయడం బండ్లకు బాగా అలవాటు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘భీమ్లానాయక్’ కూడా ఒకటి. ఈ మూవీపై ఉన్న హైప్‌కి తగినట్లే సినిమాలో పాటలకు కూడా చక్కటి రెస్పాన్స్ వస్తోంది. మేకర్స్ ఈ నెల 25న సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ మూవీ మ్యూజిక్ విషయంలో కాపీరైట్ వివాదం చెలరేగినట్లు వినిపిస్తోంది. ఈ సినిమా మాతృక అయిన…