ఓ టాప్ హీరో సినిమా అంటే చాలు… ట్రైలర్ లో కావలసినంత కాల్పులు, లెక్కలేనన్ని కత్తులు కటార్లు, పొడుచుకోవడం, చంపుకోవడం, రక్తసిక్తం- ఇలాంటి అంశాలన్నీ దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మధ్య ఇది కామన్ అయిపోయింది. తమిళ టాప్ స్టార్ విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ ట్రైలర్ కూడా ఇలాగే రూపొందింది. కొత్తదనమేమీ కనిపించదు. మూడు రోజుల క్రితం తమిళంలో సందడి చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు తెలుగులోనూ అనువాదపు పలుకులతో అలరించే ప్రయత్నం చేస్తోంది. విజయ్ హీరోగా…
దళపతి విజయ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ “బీస్ట్”. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన “బీస్ట్”లో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని “అరబిక్ కుతు” సాంగ్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది. ఇక “బీస్ట్” పాన్…