దళపతి విజయ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ “బీస్ట్”. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన “బీస్ట్”లో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని “అరబిక్ కుతు” సాంగ్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది. ఇక “బీస్ట్” పాన్ ఇండియా సినిమాగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు “బీస్ట్” తెలుగు, హిందీ ట్రైలర్ లను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు “బీస్ట్” ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
Read Also : MB Foundation : మరో పసి హృదయాన్ని కాపాడిన డాక్టర్లు
ఇక “బీస్ట్” తెలుగు విషయానికొస్తే… ఈ సినిమా తెలుగు రైట్స్ ఓ ప్రముఖ నిర్మాత దక్కించుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇక “బీస్ట్ తెలుగు ట్రైలర్ ను ఏప్రిల్ 5న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. మరో విశేషమేమిటంటే విజయ్ నెక్స్ట్ చేయబోతున్న ద్విభాషా చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. “తలపతి 66” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ సినిమా విజయ్ కు మొదటి డైరెక్ట్ తెలుగు మూవీ కాగా, దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే చిత్రబృందం ఈ మూవీని ప్రకటించింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో విజయ్ “బీస్ట్”ను దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.