తెలంగాణలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా ఆంక్షలు విధించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈనెల 20వరకూ ఆంక్షలు వున్నా అవి సరిపోవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్ధులకు నిర్వహించనున్న వివిధ పరీక్షలు రద్దవుతున్నాయి. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న బీడీఎస్ పరీక్షల్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కోవిడ్ వల్ల చాలా మంది విద్యార్థులు ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ సోకిన…