Story Board: తెలంగాణ సర్కార్… పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో…కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చింది. ఇదే ఊపులో పంచాయతీ ఎన్నికలను నిర్వహించి…రాష్ట్రవ్యాప్తంగా పార్టీబలంగా పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీసీలకు పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో మరో వారం లేదంటే పది రోజుల్లో…
Telangana Cabinet Meeting: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే, అందెశ్రీ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Etela Rajender: బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారు. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీ బంద్‌లో భాగంగా జూబ్లీ బస్టేషన్ వద్దకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని తెలిపారు.
CM Revanth Reddy: ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇవాళ్టి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వివిధ జిల్లాలకు సంబంధించిన ఇన్‌ఛార్జీ మంత్రులు ముఖ్య నాయకులతో సమావేశమై రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఫైనల్ చేయాలని సూచించారు.
Raghunandan Rao: వంద సీట్లు గెలుస్తామని పీసీసీ చీఫ్ అంటున్నారు.. మీపై మీకు విశ్వాసం ఉంటే శాసనసభ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళదామా? రాజీనామా చేసే దైర్యం ఉందా? అని పీసీసీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఓటు చోరీపై పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఎంపీ తిప్పికొట్టారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... పీసీసీ బాధ్యత మరిచి మాట్లాడుతున్నారు.. పీసీసీ అధ్యక్షుడిగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదన్నారు. ఓటు చోరీ…
CM Revanth Reddy : తెలంగాణలో చేపట్టిన కులగణన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, విజయవంతంగా జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సర్వేను ‘రేర్ మోడల్’ గా పేర్కొనవచ్చని, దీనిపై సోనియాగాంధీ తనకు అభినందనలు తెలుపుతూ లేఖ రాయడం తన జీవితంలో ఒక గొప్ప అచీవ్‌మెంట్ గా భావిస్తున్నానని అన్నారు. “సోనియా గాంధీ రాసిన లేఖ నాకు లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు లాంటిది. అది నోబెల్, ఆస్కార్ అవార్డు…