ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్; ప్రముఖ నటి, నిర్మాత శ్రీదేవి, బోనీకపూర్ల కుమార్తె జాన్వీ కపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ‘బవాల్’. ఈ క్యూట్ లవ్ స్టోరీని ‘దంగల్’, ‘చిచ్చోరే’ ఫేమ్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు. సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య లక్నోలో మొదలైంది. ఓ పట్టణానికి చెందిన కుర్రాడు, తమ ఊరికే చెందిన ఓ అందమైన అమ్మాయిని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలని కలలుకంటూ…
గత కొంతకాలంగా వరుణ్ ధావన్, ‘చిచ్చోరే’ ఫేమ్ నితిష్ తివారి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతోందనే వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ పుకార్లకు తెర దించుతూ దర్శకనిర్మాతలు చిత్ర కథానాయకుడు వరుణ్ ధావన్ అధికారిక ప్రకటన చేశారు. వరుణ్ ధావన్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా ‘బవాల్’ పేరుతో సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని,…