టీ20 చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్‌లు అయిన బ్యాట్స్‌మెన్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. అతను 521 మ్యాచ్‌లు ఆడి చాలాసార్లు సున్నాకి ఔట్ అయ్యాడు. వెస్టిండీస్‌కు చెందిన ఈ హిట్టర్.. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడుతున్నాడు. ఆంటిగ్వా, బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే అతను 4 బంతులు ఆడి ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ అయ్యాడు.
టీమిండియా డైనమిక్ ఓపెనర్ శుభ్మాన్ గిల్ వరల్డ్ కప్లో మంచి ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో గిల్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు శుభ్మాన్ గిల్. వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్ గా గిల్ రికార్డుల్లోకెక్కాడు.
IND VS AUS : భారత్ vs ఆస్ట్రేలియా 4 టెస్ట్ సిరీస్ ఇరు జట్ల మధ్య జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి 2 మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.