ఫిబ్రవరి నెల నిజానికి సినిమా వాళ్ళకు డ్రై మంత్. ఎగ్జామినేషన్ ఫీవర్ మొదలు కావడంతో పేరెంట్స్ అంతా పిల్లల చదువుపై దృష్టి పెడుతుంటారు. అయితే సంక్రాంతి సీజన్ మిస్ చేసుకున్న వాళ్ళు, మార్చిలో పెద్ద సినిమా విడుదల కారణంగా తమకు థియేటర్లు దొరకవని భావించిన వారు ఫిబ్రవరి నెలలోనే తమ చిత్రాలను విడుదల చేస్తుంటారు. అందులో సహజంగానే చిన్న చిత్రాలు ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి మొదటి వారాంతంలో ఏడు సినిమాలు విడుదల కాగా, గత వారం ఓటీటీ…