ఫిబ్రవరి నెల నిజానికి సినిమా వాళ్ళకు డ్రై మంత్. ఎగ్జామినేషన్ ఫీవర్ మొదలు కావడంతో పేరెంట్స్ అంతా పిల్లల చదువుపై దృష్టి పెడుతుంటారు. అయితే సంక్రాంతి సీజన్ మిస్ చేసుకున్న వాళ్ళు, మార్చిలో పెద్ద సినిమా విడుదల కారణంగా తమకు థియేటర్లు దొరకవని భావించిన వారు ఫిబ్రవరి నెలలోనే తమ చిత్రాలను విడుదల చేస్తుంటారు. అందులో సహజంగానే చిన్న చిత్రాలు ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి మొదటి వారాంతంలో ఏడు సినిమాలు విడుదల కాగా, గత వారం ఓటీటీ సినిమాలతో కలిపి తొమ్మిది సినిమాలు జనం ముందుకు వచ్చాయి.
Read Also : Breakup : భర్తకు బైబై చెప్పేసిన కాంట్రవర్సీ బ్యూటీ
ఇక వచ్చే శుక్రవారం అంటే 18వ తేదీ అంతకు మంచి అన్నట్టుగా ఏకంగా పది సినిమాలు థియేటర్లలో విడుదలకు క్యూ కట్టాయి. ఇందులో మోహన్ బాబు మూడేళ్ళ తర్వాత హీరోగా నటిస్తున్న ‘సన్ ఆఫ్ ఇండియా’ కూడా ఒకటి కావడం విశేషం. అలానే ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తన కొడుకు విక్రమ్ సహిదేవ్ హీరోగా నిర్మించిన ‘వర్జిన్ స్టోరీ’ సైతం ఫ్రైడే వస్తోంది. కాగా మిగిలిన సినిమాలన్నీ చిన్న చిత్రాలే. గత వారం విడుదల కావాల్సిన ‘బ్యాచ్ -1’ ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. అలానే ‘సురభి 70 ఎం.ఎం., రోమన్, విశ్వక్, 2020 గోల్ మాల్, నీకు నాకు పెళ్ళంట’ సినిమాలు వీకెండ్ లో విడుదల కానున్నాయి. వీటితో పాటు ఆంగ్ల అనువాద చిత్రం ‘అన్ చార్టెడ్’, కన్నడ డబ్బింగ్ సినిమా ‘బడవ రాస్కెల్’ కూడా వస్తున్నాయి. మరి ఈ పది చిత్రాలలో వేటికి ప్రేక్షకులకు పట్టం కడతారో చూడాలి.