నిత్యం రద్దీగా వుండే విజయవాడలో ఓకారులో లభించిన డెడ్ బాడీ అందరినీ పరుగులు పెట్టించింది. చాలా రోజుల నుంచి అక్కడో కారు పార్క్ చేసి ఉన్నా నిత్యం అక్కడ గస్తీ తిరిగే పోలీసులు పట్టించుకోలేదు. ఆ ప్రాంతంలో కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఆ కారును పరిశీలించారు. కారులో డెడ్ బాడీ వుండడంతో అసలేం జరిగిందో అర్థంకాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణాజిల్లా పటమటలంకలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.…