విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ బ్యానర్ ను మే 28న గ్రాండ్ గా లాంచ్ చేశారు. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం1గా నందమూరి జయకృష్ణ కుమారుడు, నందమూరి చైతన్య కృష్ణని హీరోగా పరిచయం చేస్తూ వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన చిత్రం నిర్మిస్తున్నారు. ఈ…
మహానటుడు ఎన్టీయార్ కేవలం నటనకే పరిమితం కాలేదు. చిత్ర నిర్మాణంలోనూ చురుకుగా పాల్గొన్నారు. ఎన్.ఎ.టి., ఆర్కే ఎన్.ఎ.టి., రామకృష్ణ సినీ స్టూడియోస్, తారకరామ ఫిల్మ్ యూనిట్, రామకృష్ణ హార్టీ కల్చరల్ స్టూడియోస్, శ్రీమతి కంబైన్స్ వంటి పతాకాలపై పలు చిత్రాలు నిర్మించారు. ఆయన నట వారసుడు బాలకృష్ణ ఎన్.బి.కె. బ్యానర్ పైన ఎన్టీయార్ బయోపిక్ ను రెండు భాగాలుగా నిర్మించారు. అలానే హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో పలు చిత్రాలు…