గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక విద్యను అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ వివాదం చెలరేగింది. భోజన, బోధన, వసతి పరంగా భవిష్యత్ లో సమస్యలు ఉత్పన్నం కాకుండా విద్యార్థులు ఎన్ని ఆందోళనలు చేపట్టిన.. అదే తీరులో కొనసాగుతోంది. బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ నెలకొన్న సమస్యలు మళ్లీ ఎన్టీవీ వెలుగులోకి తెచ్చింది. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ మెస్ లో ఫర్నిచర్ కొరత పై ట్విట్టర్ వేదికగా ట్రిపుల్…
బాసర ట్రిపుల్ ఐటీలో ఏడు రోజులుగా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో బాసర విద్యార్థుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అందులో.. బాసర ఐఐఐటీ విద్యార్ధులు ఎండకు ఎండుతూ వానకు తడస్తూ ఆందోళన చేస్తున్నారని, వాళ్ల సమస్యలు సిల్లీ అంటూ విద్యా శాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మరో వైపు మీ పుత్ర…
బాసర ట్రిపుల్ ఐటి క్యాంపస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు క్యాంపస్‌లోకి దూసుకు రావడంతో.. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. క్యాంపస్ లోనికి అనుమతించకపోవడంతో.. క్యాంపస్ ఎదుట బీజేపీ నేతల ధర్నాకు దిగారు. క్యాంపస్‌లోకి ఎవరినీ రానీయకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ నేతలు దూసుకురావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీకీ వస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా బికనూర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. తాను బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలపడానికి, సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. బండి సంజయ్‌ను పోలీసు వాహనంలో ఎక్కించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. కాన్వాయి ముందు ఉన్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.…
గత మూడురోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ (నాలుగోరోజు)కూడా ఆందోళనకు సిద్దమవుతున్న నేపథ్యంలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి బాసర ట్రిపుల్ ఐటీ వద్దకు వెళ్లనున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను కలిసి వారి సమస్యలను, డిమాండ్లను బండి సంజయ్ తెలుసుకోనున్నారు. కాగా.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నాలుగోరోజుకు చేరింది. నిన్న బాసర ట్రిపుల్…
బాసర ట్రిపుల్ ఐటీకి శాశ్వత వైస్ ఛాన్సలర్‌ను వెంటనే నియమించి, విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి బాసర ట్రిపుల్ ఐటీ లోపల చేసిన శాంతియుత పోరాటాన్ని పోలీసులు భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్…