హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా.. వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే.. విద్యార్థులు మాత్రం సీఎం కేసీఆర్ లేక మంత్రి కేటీఆర్ వచ్చి మా సమస్యలను వినాలని మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ఓ ప్రకటనను…
బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు చేస్తోన్న ఆందోళనకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల వాస్తవ డిమాండ్‌లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సిల్లీ అని కొట్టిపారేయటం విస్మయాన్ని కలిగిస్తుందని సామాజిక మాధ్యమం వేదికగా రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని సీఎం మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో దయనీయమైన పరిస్థితులను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్…