100Days Movie: ఒకప్పుడు సినిమాల విజయానికి సదరు చిత్రాలు శతదినోత్సవం ప్రదర్శితం కావడం కొలమానంగా ఉండేది. అంతకు మించి ఆడితే ఆ సినిమా మరెంతో విజయం సాధించిందని భావించేవారు. అయితే అప్పట్లో కొన్ని చిత్రాలు నిజాయితీగా ప్రదర్శితమయ్యేవి.
తెలుగు చిత్రసీమలో బాపు తీతకు, ముళ్ళపూడి వెంకటరమణ రాతకు విశేషస్థానముంది. వారి జోడీ సాంఘికం తీసినా, పౌరాణికం తెరకెక్కించినా, రీమేక్స్ అందించినా జనం అభిమానించారు, ఆదరించారు. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, పరభాషల్లో విజయం సాధించిన చిత్రాలకు తెలుగుదనం అద్ది అందించడంలోనూ బాపు-రమణ తమదైన బాణీ పలికించారు. అలా వారి అద్దకంలో వెలుగు చూసిన చిత్రాల్లో ‘రాధా కళ్యాణం’ ఒకటి. తమిళంలో భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన ‘అంద 7 నాట్కల్’ చిత్రం ఆధారంగా ఈ ‘రాధా కళ్యాణం’…