Cheque Spelling Errors: హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాకు చెందిన ఒక ఆర్ట్ టీచర్‌ను సస్పెండ్ చేశారు. ఆయన సంతకం చేసిన చెక్కుపై అక్షర దోషాలు (స్పెల్లింగ్ మిస్టేక్స్) తీవ్రంగా ఉండటంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ ఈ తప్పులను తీవ్రమైనవి, ఆమోదయోగ్యం కానివిగా పేర్కొంటూ వివరణ కోరింది.