Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సర్కార్ నెమ్మదిగా ఆ దేశ చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన, ఆ దేశ జాతిపితగా కీర్తించబడే షేక్ ముజిబుర్ రెహ్మన్‌కి సంబంధించిన చరిత్రను పాఠశాల పుస్తకాల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి అయిన ముజిబుర్ రెహ్మాన్ పాత్రను స్వాతంత్య్ర పోరాటం నుంచి తగ్గిస్తోంది. దీనికి తోడు 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి కారణమైన, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ సహకారాన్ని కూడా…