Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆ దేశంలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిందో, అప్పటి నుంచి ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్స్ చెలరేగిపోతున్నారు. యూనస్ ప్రభుత్వం జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల్ని, అరాచకవాదుల్ని విడుదల చేసింది.