Sheikh Hasina: దేశం విడిచి వెళ్లిన తర్వాత తొలిసారిగా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తన మౌనాన్ని వీడారు. దేశంలో విద్యార్థుల నిరసనల తర్వాత జరిగిన తిరుగుబాటు గురించి ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనలు అమెరికా కుట్రపన్ని పాకిస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగ్రవాద దాడి అని షేక్ హసీనా పేర్కొన్నారు. READ ALSO: LVM3-M5 Rocket: నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5 రాకెట్ విదేశీ కుట్రలో భాగం..…
మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి ఏడాది అయింది. ఆమె పార్టీ అవామీ లీగ్, స్టూడెంట్స్ లీగ్‌లను బంగ్లాలో నిషేధించారు. అయినప్పటికీ.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ మనస్సులో షేక్ హసీనా భయం తొలగిపోయినట్లు కనిపించడం లేదు. మొహమ్మద్ యూనస్ మరోసారి షేక్ హసీనా పార్టీపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు అవామీ లీగ్ దేశంలో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.