Bangladesh: బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలకు తేదీలు ఖరారయ్యాయి. బంగ్లా 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలను 2026, ఫిబ్రవరి 12 నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఈ ప్రకటన చేశారు.