Bangladesh: బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్‌లో శుక్రవారం రాత్రి గందరగోళం నెలకొంది. ఆనందంగా ముగించాల్సిన ఓ పాఠశాల వార్షికోత్సవం అర్ధరాత్రి కల్లోలంగా మారింది. శుక్రవారం రాత్రి ఇస్లామిస్టు గుంపు ప్రముఖ రాక్ గాయకుడు జేమ్స్ నిర్వహించాల్సిన సంగీత కార్యక్రమంపై దాడి చేయడంతో షోను అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో కనీసం 20 మంది గాయపడ్డారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. ‘నగర్ బౌల్’గా ప్రసిద్ధి చెందిన జేమ్స్ బంగ్లాదేశ్‌లోనే అతి పెద్ద రాక్ స్టార్‌గా గుర్తింపు…