Bangladesh clashes: బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. మరోసారి నిరసనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఆదివారం రాజధాని ఢాకాలో నిరసనకారులు చేపట్టిన కార్యక్రమాలు హింసకు కారణమయ్యాయి. నిరసనకారులు పోలీసులు, అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో 93 మందికి పైగా మరణించారు.
Bangladesh clashes: బంగ్లాదేశ్ వ్యాప్తంగా మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు, ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 200 మందికి పైగా మృతి చెందారు. ఇదిలా ఉంటే పోలీసులు అణిచివేతకు వ్యతిరేకంగా మరోసారి ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకారులు రోడ్డెక్కారు. రాజధాని ఢాకాలో నిరసనకారులు, విద్యార్థులు పోలీసులకు, అధికార అవామీ లీగ్ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగాయి.…
హింసాత్మక నిరసనల మధ్య ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానాన్ని కొనసాగించాలన్న హైకోర్టు నిర్ణయాన్ని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదివారం రద్దు చేసింది. అయితే..సుప్రీం కోర్టు ఈ రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయలేదు.