Komuravelli Mallanna: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. కేతమ్మ, మేడల దేవి సమేత మల్లికార్జున స్వామి వారి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కొమురవెల్లి మల్లన్న జాతరలో భాగంగా మంత్రి హరీశ్ రావు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు.…