నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు జన్మజన్మలబంధం ఉన్న కథలు బాగా అచ్చి వచ్చాయనే చెప్పాలి. ఏయన్నార్ కు హీరోగా మంచి పేరు సంపాదించి పెట్టిన ‘బాలరాజు’ జానపదం అలాంటి కథనే. ఆ తరువాత జనం మదిలో ఆయన బాలరాజుగా నిలిచారు. ఇక 1964లో రూపొందిన ‘మూగమనసులు’ రెండు జన్మల కథతో తెరకెక్కి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అందువల్ల ఏయన్నార్ తో పూర్వజన్మగాథలు నిర్మిస్తే విజయం సాధించవచ్చునని దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తలచారు. అంతకు ముందు ఏయన్నార్…