యూపీలో విషాదం చోటు చేసుకుంది. ఫరూఖాబాద్ జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నీళ్లు తాగేందుకు వెళ్లిన విద్యార్థి.. ట్యాప్ విప్పగానే ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. చిన్నారి నేలపై పడి ఉండడం గమనించిన పాఠశాల సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు చిన్నారిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. చంద్రయాన్-3కి సంబంధించి ప్రతి భారతీయుడు గర్వంతో పొంగిపోతున్నాడు. అయితే ప్రస్తుతం చంద్రయాన్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.