‘బాలికా వధూ 2’ ప్రోమో విడుదలైంది. సరికొత్త ఆనంది ఎవరో ప్రేక్షకులకి తెలిసిపోయింది. గతంలో డైలీ సీరియల్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్న ‘బాలికా వధూ’కి ఇది సీక్వెల్ అనుకోవచ్చు. అయితే, కంప్లీట్ గా కొత్త స్టోరీ అని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇంతకు ముందు బాలికా వధూగా అవికా గోర్ నటించింది. ఈసారి ఆనంది పాత్రలో కనిపించిన చిన్నారి మరింత తక్కువ వయస్సు అమ్మాయి కావటం విశేషం. ప్రోమోలో ఆమెని కొత్త పెళ్లికూతురుగా చూపించారు. ఇంట్లో కాలుమోపిన…