ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న ‘బలమెవ్వడు’ సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్. బి. మార్కండేయులు ‘బలమెవ్వడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధృవన్ కటకం నియా త్రిపాఠితో పాటు సుహాసిని మణిరత్నం, బబ్లూ పృథ్వీరాజ్ మరియు నాసర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణి శర్మ సంగీతం. సత్య రాచకొండ దర్శకత్వం వహించారు. శ్రీజయ గోదావరిచిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఆర్…
దశాబ్దాలుగా తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్నారు సుహసిని. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు సుహసిని అంటే ప్రత్యేక అభిమానం. వాళ్ల అభిమానాన్ని కాపాడుకునేలా గొప్ప క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారామె. గతంలో ఎన్టీయార్ – కృష్ణవంశీ ‘రాఖీ’ చిత్రంలో ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎంత పేరొచ్చిందో అందరికీ తెలిసిందే. ‘ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ పాత్రను ‘బలమెవ్వడు’ చిత్రంలో పోషిస్తున్నార’ని ఆ చిత్ర దర్శకుడు సత్య రాచకొండ…