నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ రోజు “నాట్యం” అనే సినిమాలోని మొదటి సాంగ్ “నమః శివాయ”ను రిలీజ్ చేశారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ తన హిందూపూర్ నియోజకవర్గంలోని లేపాక్షి ఆలయంలో చిత్రీకరించబడిన పాటపై సంతోషం వ్యక్తం చేశారు. టీమ్ మొత్తాన్ని అభినందిస్తూ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు.
Read Also : “మహాసముద్రం” ఫస్ట్ సాంగ్… రంభకు మాస్ ట్రిబ్యూట్
“నమః శివాయ” వీడియో సాంగ్ శివుడికి ఆధ్యాత్మిక నివాళి. శ్రవణ్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటలో సినిమా ప్రధాన నటులు సంధ్య రాజు మరియు కమల్ కామరాజ్ కూచిపూడి డ్యాన్స్ ను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ పాట ఒక అర్ధనారీశ్వర స్తోత్రం, మొదట జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య రచించారు. అదనపు సాహిత్యం కరుంకర్ అడిగార్ల రాశారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్య రాజు ఈ సినిమాతో నటి, నిర్మాత, కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. కమల్ కామరాజ్ 1 సంవత్సరం పాటు చాలా కష్టపడి సంధ్య రాజుతో కూచిపూడి నేర్చుకున్నాడు. డైరెక్టర్ రేవంత్ కోరుకొండ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెర అరంగ్రేటం చేస్తున్నారు. సంధ్య రాజు తన నిర్మాణ సంస్థ నిశ్రింకల ఫిలిమ్స్ కింద ఈ చిత్రాన్ని నిర్మించారు.