యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ‘ఎఫ్ 3’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో కలిసి తన తదుపరి ప్రాజెక్ట్ ను చేయనున్నారు. అనిల్ ఇప్పటికే బాలయ్యకు కథను విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాజాగా అనిల్-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ బడ్జెట్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ…
ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ఏడాది మొదట్లో ‘క్రాక్’తో భారీ హిట్ ను అందుకున్నాడు. మాస్ మహారాజ రవితేజ, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘క్రాక్’ కోవిడ్ సమయంలోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేనికి నిర్మాతల నుంచి, హీరోల నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి…
కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలోని చాలా థియేటర్లు మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక రాబోయే నెలల్లో విడుదల తేదీలను ప్రకటించిన భారీ బడ్జెట్ మూవీల నిర్మాతలు… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. బడా నిర్మాత సురేష్ బాబు కూడా తన హ్యాండ్ఓవర్లో ఉన్న థియేటర్లను మూసివేయాలని భావిస్తున్నట్లు ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులను డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే…
నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఉండబోతోంది అనే వార్త చాలా రోజులుగా విన్పిస్తోంది.అయితే ఈ రూమర్లపై అటు బాలయ్య గానీ, ఇటు అనిల్ రావిపూడి గానీ స్పందించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంతకుముందు వచ్చిన రూమర్లే నిజం కాబోతున్నాయట. త్వరలోనే బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతోందట. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత మహేష్ బాబుతో మరో సినిమాను రూపొందించాలనుకున్నాడు అనిల్…
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ వీడియో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బోయపాటి ఇందులో బాలయ్యను అఘోరిగా చూపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇక బాలయ్య హావభావాలు, డైలాగులు, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి కూడా బాలయ్య ‘అఖండ’ టైటిల్ రోర్…
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడవ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’. ఉగాది కానుకగా విడుదలైన ‘అఖండ’ టైటిల్ రోర్, అందులో బాలయ్య స్పెషల్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ‘అఖండ’ టైటిల్ రోర్ ఇప్పటికి 17 మిలియన్ల వ్యూస్ ను అధిగమించింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా ‘అఖండ’ టీం వికారాబాద్ అడవుల్లో…
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉగాది కానుకగా విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’కు ప్రేక్షకుల నుంచి అఖండమైన ఆదరణ లభిస్తోంది. ‘అఖండ’ టైటిల్, టీజర్ లో బాలకృష్ణ గెటప్, ఆయన డైలాగ్స్, థమన్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ 15 మిలియన్ల వ్యూస్ ను దాటేసి…
‘క్రాక్’ సినిమాతో అటు రవితేజకు ఇటు చిత్ర పరిశ్రమకు ఊపు తెచ్చిన దర్శకుడు మలినేని గోపీచంద్. కరోనా తర్వాత నిస్సత్తువగా సాగుతున్న తెలుగు చిత్రపరిశ్రమకు ‘క్రాక్’ గొప్ప ఊపిరి పోసింది. ఇళ్ళకే పరిమితమైన ప్రేక్షకులను 50 శాతం ఆక్యుపెన్సీతో ఫుల్ చేసిన సినిమా ఇది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఇండియాలో తెలుగు చిత్రపరిశ్రమదే ముందడుగు. ఈ రోజున 80 సినిమాలు షూటింగ్ లో ఉన్నాయంటే వాటికి ‘క్రాక్’ ఇచ్చిన భరోసానే కారణం. ఇక విషయానికి వస్తే…
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా. పూర్ణ, జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో ఆసక్తి పెరిగిపోయింది. ‘బీబీ3’…