Akhanda 2: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని అనిశ్చితి నెలకొంది. దీంతో ‘అఖండ 2’ విడుదల తేదీపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా సీక్వెల్ అయిన ‘అఖండ 2’ విడుదలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సినిమా విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ‘అఖండ 2’ సినిమా థియేట్రికల్, డిజిటల్ విడుదలలన్నింటినీ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ S.M. సుబ్రమన్యం మరియు జస్టిస్ C. కుమారప్పన్ లతో కూడిన…