అభిమానానికి హద్దులు ఉండవు. తాము అభిమానించేవారి పేర్లను, బొమ్మలను తమ శరీరంపై పచ్చబొట్లుగా వేయించుకొని మురిసిపోవడమూ కొందరికి ఆనందం ఇస్తుంది. నటసింహ నందమూరి బాలకృష్ణ వీరాభిమాని కార్తిక్ కూడా అలా ఆనందంలో ఓలలాడుతున్నాడు. హైదరాబాద్ కు చెందిన కార్తిక్ ఎమ్.బి.ఏ. చదివాడు. ఎంచక్కా తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే మదిలో కొలువైన అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ బొమ్మను ట్యాటూగా తన జబ్బపై వేయించుకుని ఆనందించాడు కార్తిక్. ఇందులో విశేషమేముంది? అలా ఎంతోమంది ఫ్యాన్స్ చేస్తున్నారు…