Ukraine War: ఏడాదిన్నరగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఉక్రెయిన్ నగరం బఖ్‌ముత్ ని రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యన్ బలగాలకు, ప్రైవేట్ కిరాయి సైన్యం వాగ్నర్ ను అభినందించారు. యుద్ధం కొనసాగుతుందని ఉక్రెయిన్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ నగరాన్ని చేజిక్కించుకున్నట్లు రష్యా ప్రకటించింది.
Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని బఖ్‌ముత్ పట్టణాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ బఖ్‌ముత్ చేజారిపోకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో బఖ్‌ముత్ కేంద్రంగా మారణహోమం జరుగుతోంది. నెలల తరబడి ఈ పట్టణంపై ఆధిపత్యం కనబరిచేందుకు రష్యన్ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.