బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్… తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తొలిరోజే టార్గెట్ చేశారు.. నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘రాజ్యాధికార సంకల్ప సభ’లో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకున్న ఆయనకు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు.. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలని ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి అలాగే ఉన్న అసంపూర్తి ఆకాంక్షలు, ఆశలను…