Odisha Train Tragedy: ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ సమీపంలోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంతపూర్ రైళ్లు ఢీకొట్టుకున్న ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి కలిగించింది. రైల్వే శాఖ మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ చూడని ఘోరమైన ప్రమాదం జరిగింది.
ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ నుంచి 300 మీటర్ల దూరంలో షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ అనే ఒక రైలు మాత్రమే పట్టాలు తప్పిందని ప్రమాదం తర్వాత ప్రాథమిక నివేదికలు సూచించాయి.