Air Travel: విమాన ప్రయాణాన్ని క్రమబద్ధీకరించాడనికి, భద్రత చర్యలను కఠినతరం చేయడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) కఠినమైన ‘‘లగేజ్’’ నిబంధనల్ని తీసుకువచ్చింది. ఇప్పుడు విమానాల్లో హ్యాండ్ లగేజీ లేదా హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకెళ్లడానికి పరిమితుల్ని విధించింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాల్లో ప్రయాణికులు విమానంలో ఒక క్యాబిన్ బ్యాగ్ లేదా హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకెళ్లడానికి పరిమితం చేయనున్నారు. విమానాశ్రయాల్లో నానాటికి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను నిర్వహించడంతో పాటు ఆపరేషనల్ ఎఫిషియెన్సీని పంచడానికి ప్రభుత్వం ఈ…