బద్వేల్ లో బీజేపీ నైతికంగా విజయం సాధించింది అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బద్వేల్ లో 40వేల ఓట్లను వైసీపీ రిగ్గింగ్ చేసింది. మేము ఏం చేశామో పాంప్లెట్ ఇచ్చి ఓటు అడిగాము. వైసీపీ వెయ్యి నోటు ఇచ్చి ఓటు అడిగింది. బద్వేల్ లో మేము ధర్మపోరాటం చేశాం, వైసీపీ అధర్మ యుద్ధం చేసింది. రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది. సీఎం సొంత జిల్లాలో ఓట్లు కొనుక్కునే దుస్థితి వైసీపీకి వచ్చింది.…