ఏపీలో బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అయింది. ఏపీ అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ సారి 11 రోజులు మాత్రమే జరగనున్నాయి. ఈ నెల 14న ప్రారంభమయ్యే ఈ భేటీలు 29 వరకు జరపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మధ్యలో శని, ఆదివారాలు, ఉగాది సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో సభ జరగనుంది. 17వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టి, 18, 19 సెలవులు ప్రకటించనుంది.
అలాగే 22న ఉగాది సందర్భంగా సెలవు రానుంది. 25, 26 తేదీల్లో శని, ఆదివారాలు కాగా, 30న శ్రీరామనవమి సెలవు కావడంతో 29నే సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తేదీలను అధికారికంగా బిజినెస్ సలహా మండలి సమావేశంలో ఖరారు చేయాల్సి ఉంటుంది. ఉభయ సభలనుద్దేశించి నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు.
Read Also: Curd With Sugar: మీకు పెరుగులో పంచదార కలిపి తినే అలవాటు ఉందా?