సంక్రాంతి పండగపూట కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ కన్నడ టీవీ నటి అమృతా నాయుడు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. బెంగుళూరులో గురువారం రాత్రి ఆమె తన 6 ఏళ్ల కూతురు సమన్వితో కలిసి స్కూటీ మీద వెళ్తుండగా పెద్ద లారీ ఆమె బండిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సమన్వి అక్కడిక్కడే మృతిచెందగా.. అమృతకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని…