NCERT: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి స్కూల్ పుస్తకాల్లో కీలక మార్పులను చేసింది. పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని తీసేసింది.
Ayodhya : రామాలయంలో రాంలాలా జీవితాభిషేకంతో అయోధ్య మొత్తం వెలిగిపోతోంది. ఇదిలా ఉండగా అక్కడ నిర్మించనున్న మసీదుకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది.
Asaduddin Owaisi: రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక ముందు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కర్ణాటక కలబురిగిలో మీడియాతోమాట్లాడుతూ.. బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ‘‘క్రమపద్ధతి’’లో లాక్కున్నారని అన్నారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయకుంటే ఈ రోజు ముస్లింలు ఇలాంటి వాటిని చూడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
మదర్సాల్లో జాతీయ గీతం, జ్ఞానవాపి మసీదు సర్వే అంశాలపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యాడు. యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మసీదుల్లో జాతీయగీతం జనగణమనను తప్పనిసరి చేసింది. గురువారం నుంచే యూపీలోని అన్ని మసీదుల్లో జాతీయగీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుకూలంగా వారణాసి కోర్ట్ ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగీ ఆదిత్యనాథ్, బీజేపీ నాకు దేశభక్తి సర్టిఫికేట్…