ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వేరియంట్ ఓమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ ను భారతదేశంలో కనుగొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ బుధవారం వెల్లడించారు. బీఏ.2.75గా పిలిచే ఈ వేరియంట్ భారత్ తో పాటు 10 దేశాల్లో కూడా గుర్తించారు. ఈ వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే కొత్తగా…