Plane Crash: కజకిస్తాన్‌లో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 38 మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు. బాకు నుంచి రష్యాలోని చెచన్యాలోని గ్రోజీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా గ్రోజీలో విమానం ల్యాండింగ్ తిరస్కరించిన క్రమంలో కాస్పియన్ సముద్రం వైపుగా మళ్లీంచబడింది. చివరకు కజకిస్తాన్ అక్టౌ నగరంలో కూలిపోయింది.
Kazakhstan Plane Crash: అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ఎంబ్రేయిర్-190 విమానం రష్యాకు వెళ్తూ కజకిస్తాన్‌లో కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారియి. బాకు నుంచి రష్యాలోని చెచన్యాలోని గ్రోజీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా గ్రోజీలో విమానం ల్యాండింగ్ తిరస్కరించిన క్రమంలో కాస్పియన్ సముద్రం వైపుగా మళ్లీంచబడింది. చివరకు కజకిస్తాన్ అక్టౌ నగరంలో కూలిపోయింది.న ఈ ప్రమాదంలో 38 మంది మరణించగా, 29 మంది ప్రాణాలు దక్కాయి.