ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. విదేశాలకు చెందిన ప్రముఖ ఆటగాళ్లు ఓ జట్టుగా, అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు మరో జట్టుగా మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇండియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య ఆగస్టు 22న మ్యాచ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించారు. Read Also:…